ఇంకో రెండు రోజుల్లో మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అవ్వబోతుంది – తస్మాత్ జాగ్రత్త
వార్నింగ్ : ఇంకో రెండు రోజుల్లో మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అవ్వబోతుంది – తస్మాత్ జాగ్రత్త
ట్రేడింగ్ లో కొత్త స్కాము – తస్మాత్ జాగ్రత్త
ముందుగా మీ మొబైల్ కి మన లోకల్ నంబర్ నుండి ఒక ఆటోమేటెడ్ ఫోన్ కాల్ వస్తుంది. అందులో రెండు రోజులలో మీ మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతున్నట్టు మీకు వార్నింగ్ సూచన ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం ఏదైనా నెంబర్ ప్రెస్ చేయమని చెప్తుంది. మనం వెంటనే భయపడి నంబర్ ఎందుకు బ్లాక్ అవుతుంది అనే ఆలోచనతో ఏదైనా నెంబర్ ప్రెస్ చేస్తాను. ఇక అక్కడి నుండే అసలైన స్కాం మొదలవుతుంది, ఎప్పుడైతే మీరు ఆ నంబర్ ని ప్రెస్ చేస్తారు అది స్ట్రైట్ గా స్కామర్లకు కనెక్ట్ అవుతుంది. ఎదుటి నుండి స్మార్ట్ గా మాట్లాడే ఒక కస్టమర్ ప్రతినిధుల వినిపించే స్వరం. మీరు వెంటనే భయంతో నా నంబర్ ఎందుకు బ్లాక్ అవుతుంది అని అడుగుతారు. స్కామర్ నుండి వచ్చే సమాధానం మేము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. మీ నంబర్ పై ముంబై customs ఏదో పార్సెల్ దొరికినట్టు ఆ పార్సల్ చైనా కి వెళ్తున్నట్టు కావున FIR ఫైల్ అయిందని మీకు తెలుపుతాడు. అందువలన మీ నంబర్ బ్లాక్ అవ్వబోతుంది అలాగే మీ లోకల్ పోలీస్ స్టేషన్ కి కూడా మీపై ఫిర్యాదు జరగబోతుంది అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది.
అంతలో స్కామర్ మీ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక మీకు టెన్షన్ మొదలవుతుంది వెంటనే మళ్ళీ కాల్ చేయబోతారు కానీ ఆ కాల్ కలవదు. ఒకవేళ రింగ్ అయినా కూడా ఎదుటి వ్యక్తి దానిని లిఫ్ట్ చేయడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో ఒక గంభీరమైన గొంతు “హలో మేము ముంబై పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, మీపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ జరిగిందని కావున వెంటనే ముంబై రమ్మని లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు మరియు మీడియాకి కూడా ఫిర్యాదు ఇచ్చి మీ ప్రొఫైల్ మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది” అని మిమ్మల్ని అఫీషియల్ గా బెదిరిస్తాడు. వెంటనే బాధితుడు భయంతో “సార్ అసలు మ్యాటర్ ఏంటి నాపై ఎఫ్ ఐ ఆర్ ఎందుకు ఫైల్ అయింది అసలు ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు అవతలి వ్యక్తి మీరు చైనా కి Cockaigne పంపిస్తున్నట్లు దాంతోపాటు ఏదో పెన్ డ్రైవ్, మరియు లాప్టాప్ – మొబైల్ ఫోన్స్ ఆ పార్సెల్ లో దొరికాయని కావున customs వాళ్లు మీపై కేసు ఫైల్ చేశారని చెప్తాడు. వెంటనే బాధితుడు భయంతో సార్ నాకు ఏమీ తెలియదు చైనాలో నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు అని అంటాడు. అవతలి వ్యక్తి ఏది నా కోర్టులో మాట్లాడుకోవాలి ముందు వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరు అవ్వాలి అని బెదిరిస్తాడు. మిమ్మల్ని విపరీతమైన బాధకు గురి చేస్తాడు.
ఒక రెండు రోజులు గడిచాక అదే పోలీస్ స్టేషన్ నుండి ఇంకొక పోలీస్ మాట్లాడుతున్నా అని “సరే మేము ఏదో ఒక ప్రయత్నం చేసి మీపై కేసు అవ్వకుండా చూస్తామని” ఇంకో కొత్త స్వరం వినబడుతుంది. వెంటనే మీరు సంతోషపడి దానికి మేము ఏం చేయాలి అని అడుగుతారు. వెంటనే ఒక లక్ష రూపాయలు ఒక Phonepay లేదా Googlepay నెంబర్ ఇచ్చి దానికి Transfer చేయమని అవతలి వ్యక్తి చెప్తాడు. అది విన్న బాధితుడు ఏదోలా చేసి లక్ష రూపాయలు పంపిస్తాడు. లేదంటే బాధితుడు సిచువేషన్ బట్టి 50000, 20000, 10000 ఇలా బేరమాడుతూ చివరికి బాధితుడిని మోసం చేస్తాడు. బాధితుడి టెన్షన్ గ్రహించి మళ్ళీ మళ్ళీ డబ్బులు వేయించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
మీకు అన్నోన్ నెంబర్ నుండి ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా కూడా భయపడకండి. మీరు వెంటనే Cyber Crime ని ఆశ్రయించండి. మీరు భయపడితే ఇలాంటి మోసాలు మీకు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఈ మోసంలో చాలామంది చిక్కుకొని బాధపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి స్కాంలపై కొన్ని వందల కేసులు నమోదు అవ్వడం జరిగింది. ఈ స్కామర్లకు మొదటి టార్గెట్ మన తెలుగు రాష్ట్రంలో అంటే మీరు నమ్ముతారా దానికి కారణం మన అమాయకత్వం అనవసరమైన వార్తలను షేర్ చేస్తూ మన విలువైన సమయాన్ని వృధా చేయడం కంటే ఇలాంటి ముఖ్యమైన సంఘటనలను తెలియని వారికి, గ్రామాల్లో ఉండే వారికి, చదువుకోని వారికి షేర్ చేసి అమాయక ప్రజలను మనం కాపాడుకుందాం.